మొటాటి రెడ్డి సంఘం ఇందూరు నూతన కార్యవర్గం ఎన్నిక   

నవతెలంగాణ – కంటేశ్వర్
మోటాడి రెడ్డి సంఘం ఇందూరు నూతన కార్యవర్గం ఎన్నిక ఆదివారం నిర్వహించారు. ఇందులో భాగంగా కార్యవర్గం గౌరవ అధ్యక్షులుగా దావ ముత్యంరెడ్డి, అధ్యక్షులుగా గోవింద గారి గంగారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ద్యావర నర్సారెడ్డి,  కోశాధికారిగా లక్కం మనోజ్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా పోతునూరి మహిపాల్ రెడ్డి, సంయుక్త కార్యదర్శులుగా అమరం శ్రీనివాస్ రెడ్డి మరియు యెన్నం లచ్చరెడ్డి, ముఖ్య సలహాదారులుగా జి భూమారెడ్డి, టి రామ్ రెడ్డి, కార్యవర్గ సభ్యులుగా  మన్మోహన్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, సాయి రెడ్డి, సంజీవరెడ్డి, కృష్ణారెడ్డి,దేవేందర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి,  శ్రీనివాస్ రెడ్డి లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.