నవతెలంగాణ-యాచారం
కాంగ్రెస్ మండల మహిళా విభాగం అధ్యక్షురాలిగా తాడిపర్తి గ్రామానికి చెందిన మోతేకాని మంజుల నియమితులయ్యారు. శుక్రవారం కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆమెకు నియామక పత్రాన్ని అందజేశారు. అనంతరం తక్కల్లపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలిగా నందినిని నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రతిష్టత కోసం కష్టపడి పని చేయాలన్నారు. పార్టీ కోసం కష్టపడి పని చేసే వారికి ఎల్లప్పుడూ గుర్తింపు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గుండెమోని జయమ్మ, మాజీ ఎంపీపీ రాచర్ల వెంకటేశ్వర్లు, జిల్లా మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి మాజీ ఎంపీపీ రమావత్ జ్యోతి శ్రీనివాస్ నాయక్, వైస్.ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి, మండల అధ్యక్షుడు మస్కు నరసింహ, ఎంపీటీసీ కొర్ర జ్యోతి, మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మోటే శ్రీశైలం, కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పాండురంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.