పౌష్టికాహారంతోనే తల్లి బిడ్డలు సురక్షితం

నవతెలంగాణ-రాయపోల్‌
పౌష్టికాహారంతోనే తల్లి బిడ్డలు సురక్షితంగా ఉంటారని ఎంపీపీ కల్లూరి అనిత శ్రీనివాస్‌ జెడ్పిటిసి లింగాయపల్లి యాదగిరి ఏఎంసీ చైర్పర్సన్‌ ఇప్ప లక్ష్మి సిడిపిఓ వెంకట రాజమ్మ, ఎంపీడీవో మునయ్య వైద్యాధికారి మహారాజ్‌ అన్నారు. బుధవారం రాయపోల్‌ మండల కేంద్రం రైతు వేదికలో పోషకాహార మాసోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే తరం ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కావాలంటే గర్భిణీలు, బాలింతలు, కిశోర బాలికలకు పోషకాహారం తప్పనిసరిగా అవసరమని గర్భిణులకు పుట్టబోయే బిడ్డ సురక్షితంగా ఉండాలంటే పోషకాహారం తీసుకోవాలన్నారు. ర్భిణీలు, బాలింతలు, కిశోర బాలికలకు పోషకాహారంపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ప్రతి సంవత్సరం పోషణ్‌ అభియాన్‌లో భాగంగా సెప్టెంబర్‌ 1 నుండి 30 వరకు పోషకాహార మాసోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. పోషకాహార లోపం లేని గ్రామాల లక్ష్యంగా ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రాయపోల్‌ సర్పంచ్‌ మౌనిక రాజిరెడ్డి, పోషణ అభియాన్‌ బ్లాక్‌ కోఆర్డినేటర్‌ కిరణ్‌ కుమార్‌, సూపర్వైజర్లు షబానా, డేబోర రాణి, వైద్య సిబ్బంది రాము, బీఆర్‌ఎస్‌ నాయకులు కల్లూరి శ్రీనివాస్‌, ఇప్ప దయాకర్‌, రాయపోల్‌, రాంసాగర్‌ సెక్టార్ల అంగన్వాడి టీచర్లు, గర్భిణీ, బాలింత మహిళలు తదితరులు పాల్గొన్నారు.