– మరో చిన్నారికి తీవ్ర గాయాలు
– కాళ్లకల్ గ్రామ శివారులో ఘటన
నవతెలంగాణ/తూప్రాన్ రూరల్ (మనోహరాబాద్)
ఓవర్‌టేక్ చేస్తున్న లారీ స్కూటీని ఢ కొట్టడంతో.. స్కూటీపై ప్రయాణిస్తున్న వారి కింద పడటంతో వారిపై నుంచి లారీ వెళ్లింది. దాంతో తల్లి, ఇద్దరు పిల్లలు అక్కడికక్కడే మృతిచెందారు. మరో చిన్నారి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్ జాతీయ రహదారిపై గురువారం ఉదయం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ పట్టణంలోని రామ్‌నగర్ కాలనీకి చెందిన మలైకా(30), కొడుకు అగుమీర్ అద్నాన్(11), కూతుళ్లు రొకియా సుల్తానా(9), సిద్రా (7)తో కలిసి తన స్కూటీపై హైదరాబాద్‌లోని బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లారు. గురువారం ఉదయం 10 గంటల ప్రాంతంలో హైద రాబాద్ నుంచి తిరిగి మెదక్‌కు వస్తున్నారు. మార్గమధ్యలోని కాళ్లకల్ గ్రామ శివారులో రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. రోడ్డుపై సిమెంట్ దిమ్మెలను హైవేవారు ఏర్పాటు చేశారు. వీరు ప్రయాణిస్తున్న స్కూటీని వెనుక నుంచి వచ్చిన లారీని డ్రైవర్ అజాగ్రత్తగా.. స్పీడ్‌గా నడిపి ఢకొీట్టా డు. దాంతో స్కూటర్ సిమెంట్ దిమ్మెలకు తగిలి తల్లీ పిల్లలు రోడ్డుపై పడిపోయారు. వారి మీద నుంచి లారీ వెళ్లడంతో తల్లి మలైకా, కొడుకు మీర్ అద్నాన్, కూతురు రొకియా సుల్తానా అక్కడికక్కడే మృతి చెందారు. మరో చిన్నారి సిద్రా తీవ్ర గాయాలతో బయటపడింది. సమాచారం అందు కున్న తూప్రాన్ సీఐ శ్రీధర్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మనోహరాబాద్ ఎస్‌ఐ కరుణాకర్‌రెడ్డి మృతదేహాలను తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయాలపాలైన చిన్నారిని హైదరా బాద్‌లో ఓ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.