‘కన్నప్ప’లో పార్వతీ మాత..

Mother Parvati in 'Kannappa'..విష్ణు మంచు నటిస్తూ నిర్మిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘కన్నప్ప’. ఇప్పటికే ఈ చిత్రం నుంచి మోహన్‌ బాబు, మోహన్‌ లాల్‌, మధు బాల, శరత్‌ కుమార్‌, దేవరాజ్‌, హీరోయిన్‌ ప్రీతి ముకుందన్‌ పాత్రలకు సంబంధించిన లుక్‌ను రివీల్‌ చేశారు. తాజాగా పార్వతీ దేవీగా కాజల్‌ అగర్వాల్‌ లుక్‌ని రిలీజ్‌ చేశారు. ముల్లోకాలు ఏలే తల్లి.. భక్తుల్ని ఆదుకునే త్రిశక్తి.. శ్రీకాళ హస్తిలో వెలసిన శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక అంటూ పార్వతీ మాత లుక్‌ను రివీల్‌ చేశారు. ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో మోహన్‌బాబు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 25న రిలీజ్‌ కానుంది.