అమ్మతనం

motherhoodనిజంగా అమ్మతనం
అంత గొప్పదా..?
పేగు బంధం
ఏ ప్రాణికి లేదు?
మరి మనిషిగా
మనకెందుకీ తపన?
పండుటాకులు
నిశ్శబ్దంగా రాలినప్పుడు
కలిగే ఉదాశీనత
అమ్మ విషయంలో
ఎందుకు ఉండదు?
రాలే ముందు…
రాలేటప్పుడు… రాలిన తర్వాత…
అమ్మ మన గుండెకు
పరీక్ష పెడ్తున్నదా?
దిటవుకావడం ఇక నా
గుండెదే కదా బాధ్యత
పరిణామక్రమంలో
మరణం అనివార్యమైనా
మనిషి గుండెకు ఇది ఎప్పుడూ పరీక్షే.
జయించడమే కోరుకుంటుంది అమ్మతనం
– శైలి, 9959745723