పసిపిల్లలకు తల్లిపాలు అమృతంలాంటిదని ఏఎన్ఎం రాణి అన్నారు. శనివారం మండలం లోని బామ్ని ( కె) గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గర్భిణులకు, మహిళలకు ముర్రుపాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ఉపాధ్యాయురాలు ఫర్హన , పంచాయతీ కార్యదర్శి విఠల్ , ఎంఎల్హెచ్పీ వంశీ, ఆశా కార్యకర్త పోసాని, ఐకేపీ అధ్యక్షురాలు శారద ,ముక్రమున్నిస పాల్గొన్నారు.