వేములవాడ రూరల్ మండల కేంద్రంలోని ఫాజల్ నగర్ అంగన్వాడీ కేంద్రం1లో శుక్రవారం తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. గర్భిణీ స్త్రీలు, బాలింతలకు తల్లిపాల విశిష్టత పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చిన్నపిల్లల బరువు ఎత్తును కొలతలు వేశారు. శిశువు పుట్టిన వెంటనే ముర్రపాలు పట్టించాలని, తద్వారా శిశువు ఆరోగ్యంగా ఎదుగుతారని అవగాహన కల్పించారు. గర్భిణీ స్త్రీలు బాలింతలు తీసుకోవాల్సిన ఆహారంపై అంగన్వాడీ టీచర్ పంబా రాజేశ్వరి పలు సూచనలు చేశారు. వారం రోజులపాటు తల్లిపాల వారోత్సవాలు పై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో విజయ ఆశ వర్కర్ గడ్డం రాజేశ్వరి సిఏ జలజ మహిళలు తోపాటు తదితరులు పాల్గొన్నారు.