అచ్చంపేట మున్సిపల్ ఛైర్మన్ పై అవిశ్వాస యోచన.?

నవతెలంగాణ – అచ్చంపేట

(బీఆర్ఎస్ )భారత రాష్ట్ర సమితి పది ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు అచ్చంపేట మున్సిపాలిటీ చైర్మన్,  వైస్ చైర్మన్ భారత రాష్ట్ర సమితి అభ్యర్థులు గెలుపొందారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయింది. అచ్చంపేటలో కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ భారీ మెజార్టీతో గెలుపొందారు. మునిసిపల్ చైర్మన్లు వైస్ చైర్మన్లు ఎన్నికయి మూడేళ్లు పూర్తయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇప్పటికే కొన్ని మున్సిపాలిటీలలో చైర్మన్ వైస్ చైర్మన్ ల పై అవిశ్వాసం పెట్టి లెగ్గించారు. మహబూబ్నగర్ , కోస్గి మున్సిపాలిటీలలో అవిశ్వాసం పెట్టి నెగ్గించారు. ఈ నేపథ్యంలో అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ పైన కూడా అవిశ్వాసం పెట్టాలని యోజన చేస్తున్నట్లు సమాచారం పట్టణంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అచ్చంపేట మున్సిపల్ లో 20 వార్డులు ఉన్నాయి. 13 మంది టిఆర్ఎస్ కౌన్సిలర్లు గెలిచారు. ఆరు మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. ఒకరు బిజెపి పార్టీ నుండి కౌన్సిలర్ గా గెలుపొందారు. ఇప్పటికే ఒక కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైస్ చైర్మన్ భర్త కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరో నలుగురు కౌన్సిలర్లు ఎమ్మెల్యే వంశీకృష్ణ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేతరని జోరుగా చర్చ జరుగుతుంది. కేవలం నలుగురు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరితే కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ సంఖ్య పెరుగుతుంది చైర్మన్ పై అవిశ్వాసం పెట్టి నేగ్గించాలని యోచన ఉన్నట్టు తెలుస్తుంది. ప్రభుత్వం మారడంతో, అచ్చంపేటలో వంశీకృష్ణ గెలుపొందడంతో అచ్చంపేట మున్సిపల్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్నట్లుగా పట్టణ ప్రజలు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఎక్కడ నలుగురు జమ అయితే అక్కడ మున్సిపల్ చైర్మన్ పదవి పైన చర్చ బలంగా జరుగుతుంది.