మున్సిపల్ ఛైర్ పర్సన్ పై నెగ్గిన అవిశ్వాస తీర్మానం

– తిరుమలగిరి మున్సిపల్ ఛైర్ పర్సన్ పై నెగ్గిన అవిశ్వాసం
– పంతం నెగ్గించుకున్న ఎమ్మెల్యే మందుల సామేల్ 
నవతెలంగాణ – తిరుమలగిరి
తిరుమలగిరి మున్సిపల్ చైర్మన్ పోతరాజు రజిని రాజశేఖర్ తో పాటు వైస్ ఛైర్మన్ సంకేపల్లి రఘునందన్ రెడ్డి పై కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది దీంతో తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ పట్టువదలని విక్రమార్కునిలా అవిశ్వాసం నెగ్గేంతవరకు ఓటింగ్ లో పాల్గొని కౌన్సిలర్లను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. బుధవారం సూర్యాపేట ఆర్డీవోవేణు మాధవ రావు మున్సిపల్ కమిషనర్ సమక్షంలో తిరుమలగిరి మున్సిపల్ కార్యాలయంలో బుధవారం నాడు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు ఈ తీర్మానంలో కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీ చెందిన కౌన్సిలర్లు చైర్ పర్సన్, వైస్ చైర్మన్ లపై అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టి విజయం సాధించారు. చైర్మన్ వైస్ చైర్మన్ ఇరువురు బిఆర్ఎస్ పార్టీకి చెందినవారు కావడంతో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ప్రొసీడింగ్ ఆఫీసర్, ఆర్డీవో వేణు మాధవరావు తెలిపిన వివరాల ప్రకారం మున్సిపాలిటీలో మొత్తం 15 మంది కౌన్సిలర్ సభ్యులకు గాను 12 మంది సభ్యులు చైర్మన్ రజిని పై అవిశ్వాసానికి చేతులు లేపగా అవిశ్వాసం నెగ్గింది. మున్సిపాలిటీలో 15 మంది సభ్యలకు బిఆర్ఎస్ కౌన్సిలర్లు10 మంది, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఐదుగురు కాంగ్రెస్ పార్టీ నుండి ఒకరు బీజేపీకి వెళ్లిపోగా నలుగురు కాంగ్రెస్ కౌన్సిలర్స్. అవిశ్వాస తీర్మానంతో బిఆర్ఎస్ చెందిన చెందిన చైర్మన్, వైస్ చైర్మన్ మరో కౌన్సిలర్ తో కలిపి ముగ్గురు తప్ప మిగిలిన బిఆర్ఎస్, కాంగ్రెస్ బిజెపి కౌన్సిలందర్లు ఏకమై చైర్మన్ రజినిపై అవిశ్వాసం పెట్టారు. 12 మంది అవిశ్వాసానికి చేతులు లేపగా అవిశ్వాసం సులభంగా నెగ్గిoది. అనంతరం మధ్యాహ్నం రెండు గంటల తర్వాత వైస్ చైర్మన్ ఎస్ రఘునందన్ రెడ్డి పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా చైర్మన్ కు చేతులెత్తిన విధంగానే 12 మంది కౌన్సిలర్లు రఘునందన్ రెడ్డి పై అవిశ్వాసానికి చేతులెత్తగా వైస్ చైర్మన్ పై అవిశ్వాసం కూడా నెగ్గింది. ఈ సమావేశానికి ఎక్స్ అఫీషియల్ సభ్యుడిగా  ఎమ్మెల్యే మందుల సామేలు కూడా హాజరైనారు. మున్సిపాలిటిలో చైర్మన్ పై పెట్టిన అవిశ్వాసం నెగ్గిందని ఆర్డీవో వేణు మాధవరావు ప్రకటించడంతో కాంగ్రెస్  పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశారు.