పదవ తరగతి విద్యార్థులకు మోటివేషన్ తరగతులు

నవతెలంగాణ – తుర్కపల్లి
తుర్కపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో యాదాద్రి భువనగిరి జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశానుసారం మండలంలోని అన్ని పదవ తరగతి చదువుతూ విద్యార్థులకు కార్నర్ గైడ్లైన్స్, మోటివేషన్ క్లాసెస్ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ప్రభాకర్ రెడ్డి, శ్రీనివాస్ లు  పిల్లలు ఎలా చదవాలి, పరీక్షలకు ఏ విధంగా సిద్ధం కావాలే అనే అంశాలు వాటితో పాటు భవిష్యత్తులో ఎలాంటి కోర్సులు తీసుకుంటే ప్రయోజనం ఉంటుందో అట్టి విషయాలను వివరించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని తుర్కపల్లి, దత్తాయపల్లి, వాసాలమర్రి ,గంధ మల్ల, ములకలపల్లి, వీరారెడ్డిపల్లి పాఠశాలల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, సత్యం, బాలమని, శ్రీదేవి, దాసు ,జైనులవుద్దీన్, నాగరాజు, పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.