
సాధరణంగా విద్యార్థులు పరీక్షలు అనగానే భయపడి, ఆందోళన చెందుతూ ఉంటారు. ఈ భయాన్ని పోగొట్టేందుకు వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి గ్రామంలోనిజడ్పీహెచ్ఎస్ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు లైన్స్ క్లబ్ వేములవాడ ఆధ్వర్యంలో మోటివేషన్ స్పీచ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల జీవితాల్లో పదో తరగతి తర్వాత వేసే అడుగు చాలా కీలకమైనది, దాదాపు భవిష్యత్తు మొత్తం ఇక్కడే నిర్ణయమైపోతుంది అని విద్యార్థులకు ప్రేరణ కల్పించారు. పరీక్షలు రాసేటప్పుడు ప్రశాంతంగా ఒకటికి రెండుసార్లు ప్రశ్న పత్రాన్ని చదివి ప్రశ్నలకు జవాబు రాయాలని విద్యార్థులకు సూచించారు.విద్యార్థి కెరీర్‌ను నిర్దేశించే కీలకమైన మలుపు పదవ తరగతి అని అన్నారు. ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ ఆఫ్ వేములవాడ రాజన్న ప్రెసిడెంట్ గోస్కుల రవి, ట్రెజరర్ రోమాల ప్రవీణ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు భూరా సదానందం, అంజనికుమార్.. విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.