మోటో జీపీ విజేత మార్కో బెజ్జెకి

Moto GP winner Marco Bezzeckiన్యూఢిల్లీ : భారత్‌ వేదికగా తొలిసారి జరిగిన మోటో జీపీ ఇండియన్‌ గ్రాండ్‌ ప్రీ టైటిల్‌ను మార్కో బెజ్జెకి సొంతం చేసుకున్నారు. గ్రేటర్‌ నోయిడాలోని బుద్ధ ఇంటర్నేషనల్‌ సర్క్యూట్‌లో జరిగిన రేసులో మూనీ వీఆర్‌46 డుకాటి రేసింగ్‌ జట్టు తరఫున పోటీపడిన మార్కో.. 13 ల్యాప్‌లను 36.59.157 సెకండ్లలో పూర్తి చేశాడు. తొలి ల్యాప్‌ నుంచే ప్రమాక్‌ డుకాటి జట్టు రైడర్‌ జార్జ్‌ మార్టిన్‌ నుంచి మార్కోకు గట్టి పోటీ ఎదురైంది. మార్కో టైటిల్‌ గెల్చుకోగా.. జార్జ్‌ మార్టిన్‌ రెండో స్థానంలో, మాన్‌స్టర్‌ యమహా రైడర్‌ ఫాబియో క్వార్టారరో మూడో స్థానంలో నిలిచాడు.