రాంగ్ రూట్ సెల్ఫోన్ మాట్లాడుతూ నడుపుతున్న వాహనదారులు

నవతెలంగాణ – కంటేశ్వర్ 

నిజామాబాద్ నగరంలో వాహనదారులు రాంగ్ రూట్, సెల్ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడుపుతున్నట్లు నిజామాబాద్ పోలీసులు 18 ప్రాంతాలను గుర్తించారు. దీనివల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నవి నగరంలో 18 చోట్ల రాంగ్ రూట్ లో వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించనైనది. గౌరవ సిపి కల్మేశ్వర్ ఆదేశాల ప్రకారం రాంగ్ రూట్లో వాహనాలు నడిపిన సెల్ఫోన్ మాట్లాడుతూ నడిపిన వాహనాలను సీజ్ చేయడం జరుగుతుంది. దీని గురించి నేటి నుండి స్పెషల్ డ్రైవ్ నిర్వహించబడుతుందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం నుండి ప్రకటన విడుదల చేశారు. కావున నిజామాబాద్ ప్రజలు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ప్రమాదాలు జరగకుండా చూడాలని కోరుతున్నామన్నారు.