వాహనదారులు రోడ్డు నియమాలు పాటించాలి ..

Motorists should follow the rules of the road..– ప్రాణాలను కాపాడుకోవాలి 
– నెల్లికుదురు ఎస్సై చిర్రా రమేష్ బాబు 
నవతెలంగాణ – నెల్లికుదురు
ప్రతి బైకు వాహన దారుడు రోడ్డు నియమాలను కచ్చితంగా పాటించి ప్రాణాలను కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని నెల్లికుదురు ఎస్సై చిర రమేష్ బాబు తెలిపాడు. మండల కేంద్రంలోని బైక్ వాహనదారులకు ట్రాఫిక్ రూల్స్, హెల్మెంట్ వాడకం పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వాహనదారుడు బైక్ దారుడు రోడ్డు నియమాలు పాటించి ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని అన్నారు. రోడ్డు నియమాలు పాటించకుండా వాహనదారుడు ఇష్టం వచ్చినట్లుగా రోడ్లపై నడిపినట్లయితే ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నదని అన్నారు. ఆ సందర్భంలో హెల్మెట్ లేకుండా నడిపినట్లయితే ప్రమాదవశాత్తు బలమైన గాయాలయి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుందని అన్నారు. ట్రాఫిక్ నియమాలు పాటించి ప్రాణాలను కాపాడుకునే బాధ్యత ప్రతి బైక్ వాహనదారునికి ఉందని తెలిపాడు. రోడ్డు నియమాలు పాటించినట్లయితే ఎలాంటి ప్రమాదాల గురి కాకుండా ఉండే అవకాశం ఉందని అన్నారు. ప్రతి వాహనదారునికి తప్పనిసరి హెల్మెట్ బండి లైసెన్సు పొల్యూషన్ నెంబర్ తప్పకుండా ఉండాలని అన్నారు. లేనట్లయితే వారిపై చట్టమైన చర్యలు ఉంటాయని అన్నారు. పోలీసులు మీ క్షేమం కోసమే ప్రార్థిస్తున్నారని అన్నారు. పోలీసులు హెల్మెట్ ధరించకుంటే ట్రాఫిక్ నియమాలు పాటించినట్లయితే ఫైన్ వేస్తున్నారని అపోహలకు పోకుండా ఉండాలని ఈ సందర్భంగా కోరినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ గుంటుక యాకన్న కానిస్టేబుల్ రమాదేవి శిరీష తోపాటు కొంతమంది ఉన్నారు.