వాహనదారులు తప్పనిసరిగా ఇన్సూరెన్స్ చేయించుకోవాలి

Motorists must have insuranceనవతెలంగాణ – ఆర్మూర్
వాహన దారులందరూ తమ తమ వాహనాలు టు, ఫోర్ వీలర్ లకు ఇన్సూరెన్స్ తప్పనిసరిగా చేయించుకోవాలని ఎం వి ఐ వివేకానంద రెడ్డి శనివారం తెలిపారు. ఈనెల మూడవ తేదీ కమిషనర్ ఆదేశానుసారం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది తప్పనిసరి అని, వాహనం ద్వారా ఇతరులకు గాయం తగిలితే ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుందని, పర్సనల్ ఇన్సూరెన్స్ అనేది ఒక వెయ్యి నుండి రూ.1500 కట్టినచో రూ.15 లక్షల వ్యక్తిగత ప్రమాద బీమా కవర్ అవుతుందని తెలిపారు. వాహనాల తనిఖీలో భాగంగా ఇన్సూరెన్స్ లేనట్లయితే మొదటిసారిగా మూడు నెలల జైలు శిక్షతో పాటు రెండు వేల జరిమానా, రెండవసారి మూడు నెలల జైలు శిక్షలతో పాటు నాలుగు వేల జరిమానా లేదా రెండు కలిపి వేయవచ్చని తెలిపారు. తనిఖీలు ముమ్మరం చేస్తామని, హెల్మెట్, వాహన ధ్రువపత్రాలు దగ్గర ఉంచుకోవాలని తెలిపారు.