నవతెలంగాణ-ఆసిఫాబాద్
వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఎస్సై రాజేశ్వర్ తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని వివేకానంద చౌక్‌లో సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనాలకు సంబంధించిన అన్ని అనుమతి పత్రాలు వెంట ఉంచుకోవాలన్నారు. నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని సూచించారు. వాహనాలకు పెండింగ్ చలాన్లు లేకుండా చూసుకోవాలన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం సిబ్బంది కేటాయించినట్లు తెలిపారు. దాదాపు 30 మందికి పైగా వాహనదారులకు అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ దత్తు, కానిస్టేబుల్ సాగర్, సిబ్బంది పాల్గొన్నారు.