– నాఖా బందిలో వాహనాలను తనిఖీ
– తాండూరు డీఎస్పీ శేఖర్ గౌడ్
– కాలం చెల్లిన వాహనాలను నడిపితే కఠిన చర్యలు తప్పవు
నవతెలంగాణ-తాండూరు
వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని తాం డూరు డీఎస్పీ శేఖర్ గౌడ్ అన్నారు. సోమవారం తాండూరు పట్టణ కేంద్రం లోని ఇందిరా చౌక్ చౌరస్తాలో పోలీసు సిబ్బందితో కలిసి నాఖా బంది కార్యక్ర మాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని వాహనానికి సంబం టధించిన అన్ని రకాల సర్టిఫికెట్లనూ దగ్గర పెట్టుకోవాలన్నారు. కాలం చెల్లిన వాహనాలను నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబం ధనలు పాటించాలన్నారు. కార్యక్రమంలో తాండూరు రూరల్ సీఐ రాంబాబు, తాండూరు పట్టణ ఎస్‌ఐ అబ్దుల్ రావు ఫ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.