– ఆమనగల్ కడ్తాల్ మండలాల్లో వాహనదారులకు అవగాహన
– టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీ 145 కేసులు నమోదు
-25 బైకులు, 5 కార్లు సీజ్
నవతెలంగాణ – ఆమనగల్
వాహన దారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలని ట్రాఫిక్ ఎస్ఐ రవీందర్ నాయక్ అన్నారు. ఆదివారం ఆమనగల్ పట్టణంలో ట్రాఫిక్ నిబంధనలపై వాహన దారుల అవగాహన కల్పించారు. నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అనంతరం కడ్తాల్ టోల్ ప్లాజా వద్ద సిబ్బందితో కలిసి ఆయన వాహనాలను తనిఖీ చేశారు. ఈసందర్భంగా 25 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్టు ఆయన తెలిపారు. అదేవిధంగా అజాగ్రత డ్రైవింగ్ కేసులు 10, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ కేసులు 81, లైసెన్స్ లు లేని కేసులు 21, రాంగ్ సైడ్ డ్రైవింగ్ కేసులు 5, మైనర్ డ్రైవింగ్ కేసులు 3, మొత్తం 145 కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో ట్రాఫిక్ కానిస్టేబుల్స్, సిబ్బంది పులేందర్, రామస్వామి, సంతోష్, రవికాంత్, రవీందర్ గౌడ్, వెంకట్ రెడ్డి, శ్రీరామ్, నరేందర్, వెంకటేష్, లా అండ్ ఆర్డర్ స్టాప్ ఎస్ఐ వరప్రసాద్, ఏఎస్ఐ ప్రసాద్ జీ తదితరులు పాల్గొన్నారు.