వినియోగదారులకు అందుబాటులో హీరో కొత్త స్కూటర్ ను తీసుకువచ్చిందని పట్టణానికి చెందిన వ్యాపారవేత్త ముడుపు మౌనిష్ రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని హీరో షోరూంలో డెస్టినీ 125 స్కూటర్ ను ఆయన ముఖ్య అథితిగా హాజరై ప్రారంభించారు. ముందుగా కేక్ కట్ చేసి తినిపించారు. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధి స్కూటర్ ఫీచర్ ను తెలియసేశారు. వాహనదారులకు సౌకర్యవంతంగా హీరో ఈ తరం యువతను దృష్టిలో ఉంచుకొని కొత్త స్కూటర్ను లాంచ్ చేసిందని, దీన్ని వినియోగించుకోవాలని మౌనిష్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో ఎండీ రవీందర్ రెడ్డి, సుశ్రీత్ రెడ్డి, జీఎం భీంసేనా, సిబ్బంది పాల్గొన్నారు.