
నవతెలంగాణ- నూతనకల్
మండల పరిధిలోని చిల్పకుంట్ల గ్రామానికి చెందిన బి ఆర్ ఎస్ గ్రామ శాఖ మాజీ అధ్యక్షులు బత్తుల గురువయ్య కుమార్తె స్పందన అనారోగ్యంతో మంగళవారం సాయంత్రం మృతి చెందింది, బుధవారం జడ్పిటిసి కందాల దామోదర్ రెడ్డి, మృతురాలి మృత దేహం పై పూలమాలవేసి నివాళులర్పించి మృతురాలికి సంతాపం తెలిపి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సంతాపం తెలిపిన వారిలో సర్పంచ్ కొంపల్లి రామిరెడ్డి తుంగతుర్తి మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ బిక్కి బుచ్చయ్య గౌడ్ గ్రామం శాఖ అధ్యక్షులు పులుసు లింగమల్లయ్య ,మండల అధికార ప్రతినిధి బత్తుల విద్యాసాగర్ మండల ప్రచార కార్యదర్శి రేసు వెంకటేశ్వర్లు మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు బత్తుల విజయ్ కుమార్, బత్తుల సురేష్ తదితరులున్నారు…