– రెవెన్యూ అధికారులు వివక్ష చూపుతున్నారని పలువురి అవేదన
– అక్రమ ఇసుక రవాణపై చర్యలు తప్పవని తహసిల్దార్ హెచ్చరిక
– ప్రజాప్రతినిధులు సహకరించాలని తహసిల్దార్ సూచన
నవతెలంగాణ-బెజ్జంకి
మండలంలోని గాగీల్లపూర్ గ్రామంలోని మోయతుమ్మెద వాగు ఇసుకను అక్రమ రవాణదారులు గత కొద్ది ఎండ్లుగా ఇష్టారాజ్యంగా తొడుకుంటూ విచ్చలవిడిగా ట్రాక్టర్ల ద్వార తరలిస్తూ నిల్వలు ఏర్పాటుచేసి ఇతర ప్రాంతాలకు తరలించడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు.మోయతుమ్మెద వాగు నుండి ఇసుకను పదుల సంఖ్యల ట్రాక్టర్ల ద్వార రవాణదారులు తరలిస్తున్నారనే సమాచారం మేరకు శుక్రవారం ఆర్ఐ సుహాసిని వాగు ప్రాంతాన్ని సందర్శించింది.వాగు పరిసర ప్రాంతంలో అక్రమంగా ఇసుకను తరలించడానికి సిద్దంగా ఉన్న వాహనాల్లో మూడింటిని ఆర్ఐ తహసిల్దార్ కార్యలయానికి తరలించి పదింటిని వదిలేసి రావడంతో అక్రమ రవాణదారుల్లో చర్చనీయాంశంగా మారింది.ప్రజాప్రతినిధులు,ఇతర శాఖల అధికారుల అండ ఉండడంతోనే పదుల సంఖ్యలో ఉన్న వాహనాలను వదిలిపెట్టి వెళ్లారని పలువురు రవాణదారులు అవేదన వ్యక్తం చేశారు.గ్రామంలోని ఇసుక రవాణదారులపై అధికారులు వివక్ష చూపుతున్నారని వాపోతున్నారు.అక్రమ ఇసుక వాహనాలను ఆర్ఐ కార్యాలయానికి తరలించిన కొద్ది సమయంలోనే మరికొందరు అక్రమ ఇసుక రవాణదారులు వాగు నుండి ట్రాక్టర్లలో యథావిధిగా ఇసుకను తరలించుకు వెళ్లడం అధికారులు నిర్వర్తిస్తున్న విధుల డొల్లతనానికి నిదర్శనంగా నిలుస్తోందని గ్రామస్తులు అసహనం వ్యక్తం చేశారు.తహసిల్దార్ అదేశం మేరకు వాగులో అక్రమ ఇసుక రవాణ చేస్తున్న వాహనాలపై తగు చర్యలు చేపట్టడానికి వెళ్లామని.. రవాణదారులు తమ వాహనాలను తరలించుకుపోవడంతో పట్టుబడిన వాటిని తహసిల్ కు తరలించామని ఆర్ఐ తెలిపారు.అక్రమంగా ఇసుకను తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను పట్టుకుని జరిమాన విధించామని అనుమతి లేకుండా వాగులో ప్రవేశించిన వాటిపై చట్టపరమైన చర్యలకు వేనుకాడబోమని తహసిల్దార్ తెలిపారు.మండలంలో అక్రమ ఇసుక రవాణను కట్టడిచేయడానికి ప్రజాప్రతినిధులు సహకరించాలని తహసిల్దార్ సూచించారు.