– తాడిచెర్ల భూ నిర్వాసితుల హెచ్చరిక
నవతెలంగాణ – మల్హర్ రావు
నెల రోజుల్లో తమ ఇండ్లకు తిరిగి ప్రిలిమినరీ నోటి ఫికేషన్ కాల పరిమితి పెంచి డ్రాప్ట్ నోటిఫికేషన్ ఇవ్వాలని, లేకుంటే తాడి చెర్ల ఓసీపీ బొగ్గు తవ్వకాలు అడ్డుకుంటామని తాడిచెర్ల భూ నిర్వాసి తులు హెచ్చరించారు. గురువారం భూ నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. సంఘం ప్రధాన కార్యదర్శి అక్కపాక సమ్మయ్య మాట్లాడుతూ తాడిచెర్ల ఓసీపీ-1 గనికి 500 మీటర్ల డేంజర్ జోన్లో ఉన్న 2,800 ఇండ్లను తీసుకొని పరిహారం, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇస్తూ సురక్షిత ప్రాంతానికి తరలించాలని గత ఫిబ్రవరిలో చేపట్టిన ధర్నాకు కేటీపీఎస్ చీఫ్ ఇంజినీరు సిద్ధయ్య నాలుగు నెలల్లో పరిహారం ఇవ్వడంతో పాటు పునరావాసానికి తరలిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదని, పైగా ఓసీపీలో బాంబు పేలుళ్లతో ఇండ్లు కూలిపోవడమే కాకుండా ఫ్యాక్టరీ నుంచి వచ్చే రసాయనాలతో అనారోగ్యాల బారిన పడుతున్నామన్నారు. ఈ విషయమై జెన్కో అధికా రులు, ప్రజాప్రతినిధులకు చెప్పినా పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఆగస్టు 31లోగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, లేదంటే జాతీయ రహదారి-364 దిగ్బంధించడంతో పాటు కలెక్టరేట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. అప్పటికీ న్యాయం జరగకపోతే ఓసీపీని ముట్టడించి ఉత్ప త్తిని నిలిపివేస్తామన్నారు. కార్యక్రమంలో తాండ్ర మల్లేశ్, రావుల ఆంజనేయులు,కోట రాజయ్య, సారంగు, సందీప్, పీరయ్య పాల్గొన్నారు.