ప్రచార వాహనాలు తిరిగివ్వకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం

– చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
గాంధీభవన్‌లో ఉన్న కాంగ్రెస్‌ ప్రచార వాహనాలను పోలీసులు దౌర్జన్యంగా ఎత్తుకెళ్లారని కాంగ్రెస్‌ నాయకులు చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. ఆ వాహనాలను తిరిగి గాంధీభవన్‌లో అప్పగించకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. పోలీసులు బీఆర్‌ఎస్‌కు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు.న