నవతెలంగాణ-ఉట్నూర్
అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఎవరు ఆపలేరని బీఆర్‌ఎస్‌వీ జిల్లా అధ్యక్షులు ధరణి రాజేష్ అన్నారు. శుక్రవారం బీఆర్‌ఎస్ నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి, ఉట్నూర్ పోలీస్‌స్టేషన్‌లో నిర్బందించారు. ఈ సందర్భంగా ధరణి రాజేష్ మాట్లాడుతూ అక్రమ అరెస్టులు, నిర్బంధాలు బీఆర్‌ఎస్‌కు కొత్త కాదని, మీరెంత అణిచివేయాలని చూసినా ఉప్పెనలా లేస్తామని అన్నారు. మరో తెలంగాణ ఉద్యమం లేస్తుందని తెలిపారు. తప్పుడు మాటలు చెప్పి ప్రజలను మోసం చేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్ అని మీ దుర్మార్గాలను, మోసాలను ప్రజా క్షేత్రంలో ఎండగడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ ముజీబ్, దూట మహేందర్, కోల సత్తన్న, కుర్సెంగా భూమన్న పాల్గొన్నారు.
తాంసి : ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి మద్దతుగా తాంసి మండల బీఆర్‌ఎస్ నాయకులు హైదరాబాద్‌కు బయలుదేరుతారనే సమాచారంతో నాయకులు వెళ్లకుండా ముందస్తుగా ఎస్సై శివరాం బీఆర్‌ఎస్ నాయకులను ఎక్కడికి అక్కడ హౌస్ అరెస్ట్ చేసి, పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం వారిని సొంత పూచికత్తుపై విడిచిపెట్టారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నియంతగా వ్యవహరిస్తుందన్నారు. పాడి కౌశిక్‌రెడ్డి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులు హత్యాయత్నానికి ప్రయత్నించడం హేమమైన చర్య అని అన్నారు. పోలీసులు అక్కడ ఉండి కూడా ఒక ఎమ్మెల్యేపై అంత దౌర్జన్యం చేసిన ఏమి చేయలేక పోయారన్నారు. ఎన్ని నిర్బంధాలు చేసిన బీఆర్‌ఎస్ నాయకులు భయపడదిలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో కంది గోవర్ధన్‌రెడ్డి, మహేందర్, అశోక్, రఘు, నాగిరెడ్డి ఉన్నారు.
నార్నూర్ : హరీశ్‌రావు అక్రమ అరెస్టు ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి మీద జరిగిన దాడికి నిరసనగా హైదరాబాద్ వెళుతున్న ఉమ్మడి నార్నూర్, గాదిగూడ బీఆర్‌ఎస్ నాయకులను శుక్రవారం సీఐ రహీమ్ పాషా, గాదిగూడ ఎస్సై మహేష్ పోలీసు సిబ్బంది ముందస్తుగా అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో పీఏసీఎస్ ఇన్‌ఛార్జి చైర్మెన్ సురేష్ అడే, సయ్యద్ ఖాసీం, ఫిరోజ్‌ఖాన్, పార్టీ సీనియర్ నాయకులు ఆడ రాజేశ్వర్, మాజీ వైస్ ఎంపీపీ యోగేష్, కోఆప్షన్ సభ్యులు జామ్డే బాబు, జవాడే భారత్, కోటంబే డిగాంబర్ ఉన్నారు.
పెంబి : హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మధ్య జరిగిన వివాదం నేపథ్యంలో శుక్రవారం మండల బీఆర్‌ఎస్ నాయకులను పెంబి పోలీస్‌లు ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగిస్తుందని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖుని చేసేలా శాంతియుత నిరసనలను అడ్డుకుంటూ అక్రమ అరెస్టులు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండలాధ్యక్షులు, సల్ల నరేందర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ ఆర్గుల శేఖర్‌గౌడ్, వైస్ ఎంపీపీ గంగారెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు గాండ్ల శంకర్, సుతారి మహేందర్, విలాస్, రమేష్, నానేష్, సొన్న రాజేందర్ పాల్గొన్నారు.
తలమడుగు : బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని బోథ్ నియోజకవర్గ అధికార ప్రతినిధి మొట్టె కిరణ్ కుమార్ అన్నారు. శుక్రవారం బీఆర్‌ఎస్‌కు చెందిన పలువురు మండల నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ అరికపూడి గాంధీ కారు గుర్తుతో గెలిచి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నాడని, వెంటనే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, చేతి గుర్తుకు నిలబడి గెలిచి చూపించాలని అన్నారు. బీఆర్‌ఎస్ ఉద్యమ చరిత్ర గల పార్టీని అన్నారు. తమ నాయకులపై దాడులు చేస్తే అడుగడుగునా నిలదీస్తామన్నారు. ఆయన వెంట బీఆర్‌ఎస్ నాయకులు తోట వెంకటేష్, కేదారేశ్వర్‌రెడ్డి, ఎంపీటీసీ చంటి, పిడుగు అభిరామిరెడ్డి, కటకం దేవన్న, కాటిపెల్లి శ్రీనివాసరెడ్డి ఉన్నారు.
ఖానాపూర్ : మాజీ మంత్రి హరీష్‌రావు అరెస్టుకు నిరసనగా శుక్రవారం హైదరాబాద్ వెళ్తున్న ఖానాపూర్ బీఆర్‌ఎస్ నాయకులను ఎస్‌ఐ లింబాద్రి సిబ్బందితో కలిసి అరెస్టు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తమను అక్రమంగా అరెస్టు చేయడం కాదన్నారు. అనంతరం నాయకులను పోలీసులు విడుదల చేశారు. అరెస్ట్ అయిన వారిలో మాజీ జెడ్పిటిసి రాథోడ్ రామునాయక్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కల్వకుంట్ల నారాయణ, తాళ్లపల్లి రాజగంగన్న, కొక్కుల ప్రదీప్, బూసి నరేందర్, కాలేరి దివాకర్, గౌరీకర్ రాజు, శనిగారపు శ్రవణ్, పుప్పాల గజేందర్ ఉన్నారు.