నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
హైదరాబాద్ పంజగుట్టలోని నిమ్స్ ఆస్పత్రిలో మరో క్లినిక్‌ను ప్రారంభించారు. మూవ్‌మెంట్ డిజార్డర్‌తో బాధపడే వారి కోసం శుక్రవారం నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప మూవ్ మెంట్ డిజార్డర్ క్లినిక్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్లినిక్‌లో న్యూరాలజిస్ట్, న్యూరో సర్జన్, సైకియాట్రిస్ట్ ఆ విభాగధిపతి డాక్టర్ టి.సూర్యప్రకాశ్ నేతృత్వంలో రోగులకు సేవలందిస్తారని తెలిపారు. ప్రారంభ కార్యక్రమంలో నిమ్స్ డీన్ డాక్టర్ లిజా రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.