వడ్డెర హక్కుల కోసం ఉద్యమం

–  ఆగస్టు 1,2న వడ్డెర వృత్తిదారుల సంఘం రాష్ట్ర మహాసభలు వడ్డెర :వృత్తిదారుల సంఘం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
వడ్డెర వృత్తిదారుల హక్కుల కోసం ఉద్యమాలు నిర్వహిస్తామని చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ రాష్ట్ర నాయకులు పైళ్ల ఆశయ్య, వడ్డెర వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లవు విఘ్నేష్‌ ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం హైదరాబాద్‌లోని ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వడ్డెర వత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రథమ రాష్ట్ర మహాసభను హైదరాబాద్‌లో ఆగస్టు1,2 తేదీల్లో నిర్వహించనున్నట్టు తెలిపారు. క్వారీలపై వడ్డెరలకు పూర్తి హక్కులు కల్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు. 75ఏండ్ల స్వాతంత్రంలో వడ్డెర వృత్తిదారుల బతుకులు మారలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సామాజికంగా, ఆర్థికంగా , రాజకీయంగా వెనుకబడి ఉన్నారని తెలి పారు. రాష్ట్రంలో సుమారుగా నాలుగు వేల సొసైటీలు ఉన్న ఇప్పటికీ ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదని తెలిపారు. వెనుకబడిన వడ్డెర కుటుంబాలకు వడ్డెర బంధును ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. వెనుకబడిన ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వాలని పేర్కొన్నారు. వడ్డెర వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఇడగొట్టి స్నాన, గౌరవ అధ్యక్షులు కుంచం. వెంకటకృష్ణ, రాష్ట్ర ముఖ్యసలహాదారులు రూపని లోకనాథం పాల్గొన్నారు.