
మేడారం మహా జాతర హుండీలను సోమవారం పూజార్లు ఎండోమెంట్ శాఖాధికారులు రెవెన్యూ అధికారుల సమక్షంలో హుండీలను ఆర్టీసీ డిజిటి బస్సుల ద్వారా హన్మకొండలోని టీటీడీ కళ్యాణ మండపానికి తరలించారు. 29 నుంచి దేవదాయ శాఖ అధికారులు హుండీలను లెక్కించనున్నారు. మేడారం మహా జాతరలో సమ్మక్క హుండీలు 215, సార్లమ్మ హుండీలు 215, పగిడిద్దరాజు హుండీలు 26, గోవిందరాజు హుండీలు 26, క్లాత్ హుండీలు 30 మొత్తం 512 హుండీలను పటిష్టమైన భద్రత నడుమ తరలించారు. పది రోజులపాటు లెక్కింపు కొనసాగనుంది.