అసెంబ్లీ సెగ్మెంట్లకు ఈవీఎం ల తరలింపు

– జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. వెంకట్రావ్
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
లోక్ సభా ఎన్నికల నేపథ్యంలో మొదటి ర్యాండమైజేషన్ తదుపరి ఆయా అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఈవీఎం లను పోలీస్ బందోబస్తు మధ్య వాహనాల్లో తరలించడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ అన్నారు. గురువారం కలెక్టరేట్ ఆవరణలో గల గోదాం లో ఈవీఎం తరలింపు ప్రక్రియను జిల్లా ఎస్.పి రాహుల్ హెగ్డే, అదనపు కలెక్టర్లు సి.హెచ్. ప్రియాంక, బి.ఎస్. లతలతో కలసి పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా  రెజర్వ్డ్ 25 శాతం తో బి.యు లు 1500, సి.యు లు 1500,   అలాగే  40 శాతం రిజర్వ్డ్ తో 1680 వి.వి ప్యాడ్ లు అసెంబ్లీ సెగ్మెంట్ల ఏ. ఆర్.ఓ ల ఆధ్వర్యంలో పోలీస్ భద్రత నడుమ వాహనాల్లో తరలించడం జరిగిందని అలాగే ఆయా అసెంబ్లీ సెగ్మెంట్ల స్టాంగ్ రూమ్ లో భద్రతా  తదుపరి  రెండో ర్యాండమైజేషన్ నిర్వహణ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్.డి.ఓ లు సూర్యాపేట వేణు మాధవ్,  కోదాడ సూర్యనారాయణ, హుజూర్ నగర్  శ్రీనివాస్ , ఎన్నికల విభాగం పర్యవేక్షకులు శ్రీనివాస రాజు,   తహశీల్దార్లు  సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.