బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలి

– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండీ జబ్బార్‌
నవతెలంగాణ- వనపర్తి
బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి జబ్బార్‌ పిలుపునిచ్చారు. సిపిఎం రేమద్దుల గ్రామం కమిటీ ఆధ్వర్యంలో ఎండి షర్ఫుద్దీన్‌ సంతాప సభను గ్రామ కన్వీనర్‌ ఎమ్‌. వెంకటయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఆయన చిత్రపటానికి సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి జబ్బార్‌ పూలదండ వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులు పూలతో శ్రద్ధాంజలి ఘటించారు. ఒక నిమిషం పాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండీ జబ్బార్‌ మాట్లాడుతూ విద్యార్థి దశలో ఎస్‌ఎఫ్‌ఐ లో పనిచేస్తూ సమాజం మారాలని కోరుకునే వ్యక్తి షర్ఫుద్దీన్‌ అని అన్నారు. వారికి సంతాపం ప్రకటిస్తూ, వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నామని వారన్నారు. అదేవిధంగా కేంద్రంలో ఉన్న బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బాల్‌ రెడ్డి, గ్రామ కన్వీనర్‌ ఎం వెంకటయ్య, నాయకులు భగత్‌, కాజా, మల్లేష్‌, వెంకటయ్య, కుటుంబ సభ్యులులి, తదితరులు పాల్గొన్నారు.