ప్రజా వ్యతిరేక విధానాల పై ఉద్యమించాలి

– బీఆర్ఎస్ ను గద్దె దించాలి ఏ ఐ వై ఎఫ్      
నవతెలంగాణ – చండూరు:
 నిర్మాణం, పోరాటాలతో పాలకులు అవలంభిస్తున్న యువజన వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని అఖిల భారత యువజన సమైక్య ( ఏ ఐ వై ఎఫ్) మండల అధ్యక్ష, కార్యదర్శి సాయి, గడ్డం నవీన్ పిలుపునిచ్చారు. ఆ సంఘం తెలంగాణ రాష్ట్ర రెండో మహాసభలకు సంబంధించిన గోడపత్రికను చండూర్ పట్టణంలో మాధగోని నరసన్న భవన్ లో  ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో కేసీఆర్, నరేంద్ర మోడీ ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నారని  జిడిపి వృద్ధి రేటును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా నష్టపరిచారని, దేశ వనరులను అంబానీ, ఆదాని లకు దారదత్తం చేసి కుటీల నీచ రాజకీయాలకు తేరలేపారని వారు ధ్వజమెత్తారు. ఈ తరుణంలో రాష్ట్ర, దేశ సమగ్రతలను, అభివృద్ధిని, ప్రజల హక్కుల పరిరక్షణ కోసం ఏఐవైఎఫ్ నిరంతరం పోరాటాలు సల్పిస్తుందని వారు అన్నారు. ఈ నెల 29 ,30 ల లో  హైదరాబాద్ లో జరిగే ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర రెండో మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో శివ, శంకర్, పల్లె చరణ్, స్వామి, సామి, మోహన్, వినయ్, సైదులు తదితరులు పాల్గొన్నారు.