అక్రమ అరెస్ట్‌లతో ఉద్యమాలను అపలేరు

గిరిజన విద్యార్థి సంఘం నాయకుల ముందస్తు అరెస్టు
గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు రాథోడ్‌ శ్రీనివాస్‌ నాయక్‌
నవతెలంగాణ-పరిగి
అక్రమ అరెస్ట్‌లతో ఉద్యమాలను అపలేరని గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు రాథోడ్‌ శ్రీనివాస్‌ నాయక్‌ అన్నారు. చలో ప్రగతి భవన్‌ ముట్టడి కార్యక్రమానికి శుక్రవారం వెళ్తున్న గిరిజన విద్యార్థి సంఘం నాయకులను ముందస్తు అరెస్టు చేసి పరిగి పోలీస్‌ స్టేషన్‌కు తరలించా రు. ఈ సందర్భంగా గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్య క్షులు రాథోడ్‌ శ్రీనివాస్‌ నాయక్‌ మాట్లాడుతూ అక్రమ అరెస్ట్‌లతో ఉద్యమాలను అపలేరు అన్నారు. హెల్త్‌ డైరెక్టర్‌ కడాల శ్రీనివాసరావు చేస్తున్న అవినీతి అక్రమాలపై కేస ఆర్‌కు విన్నవించడానికి వెళ్తున్న నాయకులను హౌస్‌ అరె స్టు చేసి పరిగి పోలీస్‌ స్టేషన్‌కు తరలించడం దుర్మార్గమ న్నారు. ఏజెన్సీ చట్టాలకు తూటు పొడుస్తూ గిరిజన హక్కు లను తుంగలో తొక్కుతూ, బందుప్రీతీ చాటుకుంటున్న హె ల్త్‌ డైరెక్టర్‌ గడల శ్రీనివాసరావు హెల్త్‌ డైరెక్టరా? బీఆర్‌ఎస్‌ నాయకుడా? అని ప్రశ్నించారు. అనేకమార్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావుకు ఫిర్యాదు చేసినా ఇంత వరకు ఎటువంటి చర్యలూ తీసుకోలేదన్నారు. దీనిపై ము ఖ్యమంత్రి కేసీఆర్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశా రు. కార్యక్రమంలో మండలాధ్యక్షులు అనిల్‌ నాయక్‌, జిల్లా కార్యవర్గ సభ్యులు గణేష్‌ నాయక్‌,అంబర్‌ సింగ్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.