– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ఉద్యమాలకు కార్యకర్తలు సిద్ధం కావాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి పిలుపునిచ్చారు.ఆదివారం స్థానిక సీతారామ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన పార్టీ సూర్యాపేట నియోజకవర్గ స్థాయి రాజకీయ శిక్షణా తరగతులను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రధానమంత్రి మోడీ మతతత్వంపేరుతో ప్రజల్లో విధ్వేషాలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు.కార్పొరేట్ శక్తులకు దేశసంపదను కట్టబెట్టి ప్రజా సంక్షేమాన్ని విస్మరించారని విమర్శించారు. ప్రజాచైతన్యంతో బీజేపీ మనువాదాన్ని మట్టుపెట్టాలన్నారు. రాబోయే ఎన్నికల్లో మతోన్మాద బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. గ్రామీణప్రాంతాల్లో ప్రజాసమస్యలను వెలికి తీసి ప్రజాక్షేత్రంలో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.సూర్యాపేట నియోజకవర్గంలో పార్టీ పూర్వ వైభవానికి ప్రతి కార్యకర్త పట్టుదలగా కృషిచేసి బలమైన పార్టీగా తీర్చిదిద్దాలని కోరారు.రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు. సీపీఐ(ఎం)జిల్లా కమిటీ సభ్యులు ఎల్గూరి గోవింద్ ప్రిన్సిపాల్‌గా వ్యవహరించారు.ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు ‘అంతర్జాతీయ- జాతీయ- రాష్ట్ర పరిస్థితి’ అనే విషయంపై క్లాసును బోధించారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు, కోటగోపి, జిల్లా కమిటీ సభ్యులు మేకనబోయిన శేఖర్, ధనియాకుల శ్రీకాంత్, వీరబోయిన రవి, చిన్నపంగనర్సయ్య, కొప్పుల రజిత,మేకనబోయిన సైదమ్మ, పార్టీ చివ్వెంల మండల కార్యదర్శి బచ్చలకూర రామ్‌చరణ్, తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మడ్డి అంజిబాబు, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎం.రాంబాబు, రైతుసంఘం జిల్లా సహాయ కార్యదర్శి మందడి రాంరెడ్డి, వ్యవసాయకార్మిక సంఘం జిల్లా సహాయకార్యదర్శి నల్లమేకల అంజయ్య, డీవైఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు సానబోయిన ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.