5000 కోట్లతో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసేవరకు ఉద్యమాలు ఆగవు

– అక్రమ అరెస్టులు ఐక్యమత్యానికి బలం

నవతెలంగాణ- మద్నూర్
మున్నూరు కాపులు చేపట్టిన చలో ప్రగతి భవన్ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం మున్నూరు కాపు సంఘం నాయకులకు అరెస్టులు చేయించడం అక్రమ అరెస్టులు ఐక్యమత్యానికి బలం చేకూరుతాయని సంఘం నాయకులు పేర్కొన్నారు మద్నూర్ మండలం మున్నూరు కాపులకు పోలీసులు చలో ప్రగతి భవన్ వెళ్లకుండా అడ్డుకొని అక్రమారిస్టులు చేయడం కాదని మున్నూరు కాపులకు ఐదువేల కోట్ల రూపాయలతో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు అయ్యే వరకు ఉద్యమాలు ఆగవని పోలీస్ స్టేషన్లో మద్నూర్ మండల మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు ఎస్ గంగారం విలేకరులతో మాట్లాడుతూ… ప్రభుత్వానికి హెచ్చరించారు రాష్ట్రంలో మున్నూరు కాపులకు ఆదుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని మున్నూరు కాపుల డిమాండ్లు నెరవేరేవరకు ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసిన తొమ్మిది రకాల డిమాండ్లు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మున్నూరు కాపుల కులవృత్తి వ్యవసాయమని భూములు లేని వారికి మూడు ఎకరాల చొప్పున భూమి అందించాలని ప్రతి కుటుంబానికి 5 లక్షల సాయం ప్రకటించాలని మున్నూరు కాపులకు ప్రత్యేకంగా 10% రిజర్వేషన్ లేదా బిసిడి 23% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు పోలీసులు అరెస్టు చేసిన వారిలో ఎస్ గంగారం డాక్టర్ విజయ్ ఎస్ హనుమాన్లు చౌల స్వామి కే సాయిలు రామ్ కిషన్ చౌల అనిల్ పి హనుమాన్లు జి శివాజీ టి రాములు తదితరులు ఉన్నారు.