కువైట్ ఎన్నారై ఆధ్వర్యంలో సినీ నటుని జన్మదిన వేడుకలు

నవతెలంగాణ – ఆర్మూర్
ప్రముఖ సినీ నటుడు బాల కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా శనివారం ఎన్టీఆర్ సేవా సమితి కువైట్ ఎన్నారై ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు సంబురంగా నిర్వహించినారు. ఈ సందర్భంగా ఎన్నారై కువైట్ అధ్యక్షులు బట్టు స్వామి మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ సూచనలు సలహాలతో గల్ఫ్ దేశాలలో ఎదురవుతున్న ఇబ్బందులపై సమస్యలపై కృషి చేస్తూ సమయాను కూలంగా ఇటువంటి సంబరాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలంగాణ బిసి సంక్షేమ సంఘం ఎన్నారై కువైట్ అధ్యక్షుడు బట్టు స్వామి, చుండు, బాల్ రెడ్డి నాయుడు, నాగ రెడ్డి, జనార్ధన్ రెడ్డి, కొండ రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.