కమ్మర్ పల్లిలో ఎంపీ అరవింద రోడ్ షో

నవతెలంగాణ -కమ్మర్ పల్లి
మండల కేంద్రంలో బుధవారం ఎంపీ అరవింద్ బిజెపి బాల్కొండ నియోజకవర్గ అభ్యర్థి ఏలేటి అన్నపూర్ణమ్మ తరఫున రోడ్ షో నిర్వహించారు. దివంగత మహిపాల్ రెడ్డి కుటుంబానికి మద్దతుగా నిలవాల్సిన ఆవశ్యకత కమ్మర్ పల్లి  మండల ప్రజలకు ఉందన్నారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మంత్రి ప్రశాంత్ రెడ్డి పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇసుక, మొరం అక్రమ దందాలు చేస్తూ,  కంకర క్వారీతో మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఆయన తమ్ముడు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.రాబోయే ఎన్నికల్లో మంత్రి ప్రశాంత్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పి బిజెపి అభ్యర్థి అన్నపూర్ణమ్మను గెలిపించాలని ప్రజలను కోరారు. రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించి, డబుల్ ఇంజన్ సర్కార్ ను తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. బిజెపి అభ్యర్థి అన్నపూర్ణమ్మ మాట్లాడుతూ మండలానికి చెందిన వ్యక్తులమైన  నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే అవకాశం ఇప్పటివరకు రాలేదని, ప్రస్తుతం ఆ అవకాశం లభించిందని ప్రజల ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించాలని అభ్యర్థించారు. ఇంతకుముందు ఎంపీ అరవింద్, అన్నపూర్ణమ్మ  లను బిజెపి శ్రేణులు గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ ఏలేటి  మల్లికార్జున్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.