
మండల కేంద్రానికి చెందిన సీనియర్ బీజేపీ నాయకులు పాలేపు సుబ్బయ్య కుటుంబ సభ్యులను నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ శనివారం సాయంత్రం పరామర్శించారు. సుబ్బయ్య వారం రోజుల క్రితం గుండెపోటుతో మరణించారు. విషయం తెలుసుకున్న బీజేపీ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి అర్వింద్ పాలెపు సుబ్బయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ మల్కాన్నగారి మోహన్, మండల అధ్యక్షులు కట్ట సంజీవ్, బిజెపి సీనియర్ నాయకులు రెంజర్ల గంగాధర్, మండల ఓబీసీ మోర్చా అధ్యక్షులు చింత ప్రవీణ్, మండల ప్రధాన కార్యదర్శి రెంజర్ల గంగాధర్, బీజేవైఎం నాయకుడు కొత్తపల్లి అరుణ్, బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.