ఎంపీ బ్రిజ్‌ భూషన్‌ చరణ్‌ సింగ్‌ ను శిక్షించాలి

ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కిరణ్‌
నవతెలంగాణ-ఖమ్మం
బిజెపి ఎంపీ బ్రిజ్‌ భూషన్‌ చరణ్‌ సింగ్‌ ను శిక్షించాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి డి.కిరణ్‌ డిమాండ్‌ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు ప్రవీణ్‌ అధ్యక్షతన స్థానిక సరిత క్లినిక్‌ సెంటర్లో బిజెపి ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ చరణ్‌ సింగ్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన దేశానికి కీర్తి కిరీటాన్ని తెచ్చి పెట్టిన మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్న కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరు ఎత్తినట్టు విధంగా ఉండటం దుర్మార్గమని వారికి న్యాయం చేయాలని, వారు చేస్తున్నటువంటి న్యాయమైన పోరాటాన్ని అణిచివేసేందుకు పోలీసులను వారి పైకి పంపుతూ వాళ్లని ఢిల్లీ వీధుల్లో ఈడ్చుకుంటూ వెళ్తా సిగ్గుచేటని అన్నారు. దేశానికి పతాకాలు తెచ్చిపెట్టి ఆ స్థాయిలో ఉన్నటువంటి వారిని బిజెపి ప్రభుత్వం ఈ స్థాయిలో చూస్తే సాధారణ మహిళలు ప్రజల పరిస్థితి ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బిజెపి ప్రభుత్వం ఈ విధమైన చర్యలను వెనక్కి తీసుకొని వెంటనే బ్రిడ్జిభూషణ్‌ చరణ్‌ అరెస్టు చేసి ఎంపీ పదవి నుండి భర్త రఫ్‌ చేయకపోతే ఎస్‌ఎఫ్‌ఐ ఆల్‌ ఇండియా కమిటీ ఆధ్వర్యంలో పార్లమెంట్లో ముట్టడించి వారికి న్యాయం చేసేంతవరకు ఎస్‌ఎఫ్‌ఐ తోడుగా ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీకాంత్‌ వర్మ, రాష్ట్ర సహాయ కార్యదర్శి డి వీరభద్రం, మిస్రీన్‌ సుల్తానా రాష్ట్ర కమిటీ సభ్యులు పర్వీన్‌, శైలజ, సాయి, ప్రశాంత్‌, తోకల రవి ,సుధాకర్‌, సాయి, పావని, సరళ ,స్రవంతి తదితరులు పాల్గొన్నారు.