ఆందోల్ మైసమ్మ బోనాల ఉత్సవాలలో పాల్గొన్న ఎంపీ చామల

MP Chamala participated in Andol Maisamma Bonala celebrationsనవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం గ్రామంలో ఆందోల్ మైసమ్మ బోనాలు,చండీ హోమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి హోమం నిర్వహించారు. సాయంత్రం గ్రామంలో అమ్మవారి రథోత్సవం కళాకారులచే ఘనంగా నిర్వహిస్తామని ఆలయ కార్య నిర్వహణ అధికారి ఎస్. మోహన్ బాబు తెలిపారు.అనంతరం కామిశెట్టి విజయకుమార్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మాజీ ఎంపీపీ జడ్పీటీసీలు తాడూరి వెంకట్ రెడ్డి చిలుకూరి ప్రభాకర్ రెడ్డి పిఎసిఎస్ ఉపాధ్యక్షులు చెనగోని అంజయ్య గౌడ్ కాంగ్రెస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు పబ్బు రాజు గౌడ్ బ్లాక్ మండల పట్టణ అధ్యక్షులు ఆకుల ఇంద్రసేనారెడ్డి బోయ దేవేందర్ సుర్వి నరసింహ గౌడ్ మాజీ ఎంపిటిసి చిట్టెంపల్లి శ్రీనివాసరావు మాజీ సర్పంచులు ఏలువర్తి యాదగిరి ఓం ప్రకాష్ ఉత్సవ కమిటీ సభ్యులు చిలుకూరి మల్లారెడ్డి,బుర్ర స్వామి గౌడ్,ముదిగొండ రమేష్,గుండు శ్రీహరి గౌడ్, చిట్టెంపల్లి జంగయ్య,ఈద్దుల విజయ్,గంగాధర్, అత్తాపురం అంజిరెడ్డి,రవీందర్,ప్రవీణ్ రెడ్డి,శ్రీకాంత్ భక్తులు తదితరులు పాల్గొన్నారు.