ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను, హాస్టలను పరిశీలించిన: ఎంపీపీ దశరథ్ రెడ్డి

నవతెలంగాణ- రామారెడ్డి
మండల కేంద్రంలోని షెడ్యూల్ కులాల వసతి గృహాన్ని, కస్తూర్బా గురుకుల హాస్టల్ను, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం స్థానిక ఎంపీపీ నా రెడ్డి దశరథ్ రెడ్డి పరిశీలించారు. పిహెచ్సిలో పలు రికార్డులను పరిశీలించారు. మందుల నిలువ, రోగుల వివరాలపై ఆరా తీశారు. హాస్టల్లో విద్యార్థుల సౌకర్యాలపై వార్డెన్లను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్లు జైపాల్, పిహెచ్సి వైద్యులు సురేష్, చైతన్య,శ్యాంసుందర్, సిబ్బంది తదితరులు ఉన్నారు.