గృహలక్ష్మి మంజూరి పత్రాలను అందజేసిన ఎంపీపీ కీర్తి

నవతెలంగాణ-కోహెడ : మండలంలోని బస్వాపూర్‌ గ్రామ రైతువేదికలో ఆదివారం ఎంపీపీ కొక్కుల కీర్తి సురేష్‌ ఆధ్వర్యంలో గృహలక్ష్మి పథకం లబ్దిదారులకు మంజూరి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వంత ఇంటిని నిర్మించుకునేందుకు ఇదోక అవకాశమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకం నిరుపేదలకు వరంగా మారిందన్నారు. మండలంలోని 294 మంది లబ్ధిదారులకు మంజూరి పత్రాలను పంపిణీ చేసినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకంతో నిరుపేదలకు సొంతింటి కల సాకారం అవుతుందన్నారు. హుస్నాబాద్‌ నియోజకవర్గ శాసనసభ్యులు వొడితల సతీష్‌కుమార్‌ ఆదేశాల మేరకు మంజూరి పత్రాలను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ పథకం ద్వార రూ.3 లక్షలు అందిస్తుందని ఇట్టి అవకాశాన్ని లబ్దిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మధుసూదన్‌, మాజీ జెడ్పిటిసి పొన్నాల లక్ష్మయ్య, మండల పరిషత్‌ కోఆప్షన్‌ సభ్యులు అబ్దుల్‌ ఖదీర్‌, ఎంపీటీసీలు కోనే శేఖర్‌, కొడముంజ మల్లవ్వ రాజు, పూల విజయ బాలయ్య, తూటి సుజాత బాపురెడ్డి, సుతారి కళ్యాణి కనకయ్య, సర్పంచ్‌లు లావుడ్య సరోజన దెవేందర్‌, ఎడబోయిన సత్తయ్య, తాళ్లపల్లి రవీందర్‌, తైదల రవీందర్‌, గ్రామపంచాయితి కార్యదర్శి నిహారిక, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.