నవతెలంగాణ – ఉప్పునుంతల
కోడెరు మండలంలో శనివారం నాడు ఎంపీపీ కొండె రాధ S/o భర్త సుధాకర్ రెడ్డి ఎంపీఓ శ్రావణ్ కుమార్ పై చెప్పుతో కొట్టి నానా దుర్భాశలాడడం జరిగింది విధులలో ఉన్న ప్రభుత్వ అధికారి పై దాడి చేసి విధులకు ఆటంకం కలిగించిన సదరు కోడెరు ఎంపీపీ రాధను వెంటనే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నట్లు ఎంపీ ఓ రాష్ట్ర సంఘ నాయకులు డిమాండ్ చేశారు. రేపు జిల్లా కలెక్టర్, ఎస్పీ ని కలిసి పిర్యాదు చేయడం జరుగుతుంది అని తెలిపారు.అలాగే రాత్రి గజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో ఎంపీపీ రాధను అరెస్టు చేసే దాకా రాష్ట్ర వ్యాపితంగా నల్ల బ్యాడ్జీలు,ధరించి నిరసనలు తెల్పడం, దశలవారీగా ఆందోళనలు చేపట్టడం జరుగుతుంది అని ఎంపీ ఓ రాష్ట్ర సంఘ నాయకులు ఎం. నారాయణ ఆదివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కే. వెంకటయ్య, చంద్రశేఖర్, వెంకటేశు, డి. నరసింహులు, డి. వెంకటేశు, కర్ణ తదితరులు పాల్గొన్నారు.