పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: ఎంపీపీ రాజేశ్వరి

నవతెలంగాణ – పెద్దవంగర: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎంపీపీ ఈదురు రాజేశ్వరి ఐలయ్య, ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణలో వారు పాల్గొని మాట్లాడారు. ప్రజలందరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు అవుతామని పేర్కొన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామాల్లో ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. దోమల నివారణకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మిషన్ భగీరథ ఏఈఈ యాకూబ్ పాషా, పంచాయతీ కార్యదర్శి రాజు, అంగన్వాడీ టీచర్లు, మండల ఎస్టీ సెల్ సంయుక్త కార్యదర్శి బానోత్ ఎల్లోజీ, గ్రామ యూత్ ప్రధాన కార్యదర్శి ఎల్తూరి మహేష్, ఫీల్డ్ అసిస్టెంట్ ఈదురు వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.