– వినతి పత్రం సమర్పించిన పలు సంఘాల నాయకులు
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రత్యేక నిధులనుండి నిధులను మంజూరు చేయాలని పలువురు కోరారు. తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ప్రజా యాత్రలో భాగంగా గురువారం మండల కేంద్రానికి వచ్చిన ఎంపీ బండి సంజయ్ కి పద్మనగర్ గ్రామానికి చెందిన పద్మశాలి సంఘం అధ్యక్షులు, ఆదర్శ క్లబ్ అధ్యక్షులు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… తంగళ్ళపల్లి మండలంలోని పద్మనగర్ గ్రామంలో ఉన్న పద్మశాలి సేవా సంఘం భవన నిర్మాణానికి ఎంపీ ప్రత్యేక నిధులు రూ.10 లక్షలు మంజూరు చేయాలని, అలాగే పద్మనగర్ లోని ఆదర్శ క్లబ్ నూతన భవన నిర్మాణానికి రూ.10 లక్షల నిధులను మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సేవా సంఘం ప్రధాన కార్యదర్శి కుమ్మరికుంట శ్రీహరి, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.