ప్రజా ప్రతినిధుల పదవీకాలంలో సహకరించిన అధికారులకు సిబ్బందికి అందరికి కృతజ్ఞతలని ఎంపీపీ సూడి శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీపీ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఇంతకాలం తమతో స్నేహపూర్వక వాతావరణం లో కలిసి పని చేసిన అధికారులకు సిబ్బందికి అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. నేటి సర్వసభ్య సమావేశంలో తొలుత ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ సభ నిర్వహణకు హాజరైన ప్రజాప్రతినిధుల అందరికీ స్వాగతం సుస్వాగతం అన్నారు. అనంతరం ఎంపీపీ శ్రీనివాసరెడ్డిని సభను ప్రారంభించాల్సిందిగా కోరారు. సమావేశంలో తొలుత వ్యవసాయ శాఖ సమీక్షలు వ్యవసాయ అధికారి కే జితేందర్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు యాసంగి 2023 24 సంవత్సరమునకు గాను పెట్టుబడి సహాయము క్రింద 2126 మంది రైతులకు 7935000/- రూపాయలను వారి ఖాతాల్లో జమ చేయడం జరిగిందని అన్నారు. మొత్తం 6490 రైతులకు 65820000/- వారి వారి ఖాతాలో జమ కావడం జరిగిందని తెలిపారు. అనంతరం విద్యాశాఖ సమీక్షలో మండల విద్యాధికారి గొంది దివాకర్ మాట్లాడుతూ 2023 24 సంవత్సరానికి గాను బాలురు 1116 మంది బాలికలు 1174 మొత్తం మీద 2290 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నట్లు తెలిపారు. అనంతరం జడ్పిటిసి తుమ్మల హరిబాబు మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ప్రభుత్వం ద్వారా ఇస్తున్న పథకాలను పూర్తిస్థాయిలో లబ్ధి చేకూర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు గుండెబోయిన నాగలక్ష్మి చాపల ఉమాదేవి గోపి దాసు ఏడుకొండలు లావుడియా రామచందర్ కో ఆప్షన్ నెంబర్ ఎండి బాబర్ మరియు డిప్యూటీ తాసిల్దార్ మమత సిడిపిఓ మల్లేశ్వరి డాక్టర్ మధు ఇతర ఇంజనీరింగ్ ఆప్కారి శాఖల ఏఈలు పాల్గొన్నారు.