ప్రజలకు మెరుగైన వైద్య సేవలకు ప్రాముఖ్యత: ఎంపీపీ సూడీ శ్రీనివాసరెడ్డి

నవతెలంగాణ-గోవిందరావుపేట
పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రాముఖ్యతను ఇస్తోందని ఎంపీపీ సూడి శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని మొద్దులగూడెం గ్రామంలో దారుల రమాదేవికి లక్ష రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు ను గ్రామ కమిటీ అధ్యక్షులు తాటికొండ శ్రీనివాసాచారి ఆధ్వర్యంలో ఎంపీపీ శ్రీనివాసరెడ్డి పార్టీ మండల అధ్యక్షులు సూరపనేని సాయికుమార్ లు అందించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని ప్రజలందరికీ వైద్యం అందించాలని సదువు ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కల్వకుంట్ల. చంద్రశేఖర రావు మతాలకు,కులాలకు, పార్టీలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరికీ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అనారోగ్యానికి గురైన వారందరూ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకొని వాటికి సంబంధించిన బిల్లులను ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపిన వెంటనే ప్రజలను ఆర్థిక ఇబ్బందుల నుండి కాపాడడం కొరకు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి ఆర్థిక సహాయం అందించడం గొప్ప సహాయమని ఆర్థికంగా వెనుకబడిన ప్రజలందరికీ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించి వారి ఆరోగ్యం సుభిక్షంగా ఉండాలని ప్రభుత్వం కోరుకుంటదని అన్నారు కార్యక్రమంలో గోవిందరావుపేట ప్రధాన కార్యదర్శి లకావత్ నరసింహ నాయక్, పృధ్విరాజ్ ఉట్ల గోవిందరావుపేట మీడియా కోఆర్డినేటర్ , ఎంపీటీసీ లౌడియా రామచందర్, ఎంపీపీ వెలిశాల స్వరూప, మండల ఉపాధ్యక్షులు బి రాజన్న, రామకృష్ణ,సీనియర్ నాయకులు తొలి మలిదశ ఉద్యమకారుడు అజ్మీర సురేష్, ఉపాధ్యక్షులు గజ్జి ఎలేందర్,వార్డ్ నెంబర్ డి పూర్ణ, ప్రధాన కార్యదర్శి ఎస్ సతీష్ రెడ్డి, ఎం వెంకన్న, బి సింహాద్రి, ఆర్ లింగయ్య, బి సంతోష్ మాజీ యూత్ అధ్యక్షులు, కే రాజు, కే సారయ్య, టి వెంకన్న, జై మల్లయ్య, ఎం నరసయ్య, బి చంటి, ఏ నరేష్, ఎం రాజేందర్, బి సమ్మయ్య, బి శ్రావణ్,టి రాములు, జి రమేష్, జి జగన్, కే నర్సయ్య, బి మొగిలి, బి శేఖర్, బి కొమురయ్య, ఆర్ నాగరాజు, పి నరసయ్య, గ్రామ ప్రజలు మహిళా సంఘాలు మహిళలు యూత్ సభ్యులు సోషల్ మీడియా వారియర్స్ తదితరులు పాల్గొన్నారు.