జహీరాబాద్ ఎంపీగా గెలుపొందిన సురేష్ షట్కార్ ను గురువారం నాడు మద్నూర్ మండల కాంగ్రెస్ నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలపడంతో ఆ నాయకులకు సురేష్ షెట్కార్ ప్రత్యేకంగా అభినందించారు. గెలుపు కోసం కృషి చేసిన నాయకులందరికీ ఎల్లవేళలా సహకరిస్తానని ఎంపీ తెలిపారు జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని జుక్కల్ నియోజకవర్గం మద్నూరు ఉమ్మడి మండలం బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన బీబీ పాటిల్ సొంత మండలం అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం మెజార్టీ తీసుకొచ్చినందుకు మద్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ రుణపడి ఉంటానని మీ కృషి మరువలేనని అభినందించినట్లు తెలిసింది. జహీరాబాద్ ఎంపీగా గెలుపొందిన తర్వాత మొట్టమొదటిసారిగా సురేష్ షట్కార్ ను కలిసిన వారిలో రామ్ పటేల్, కొండ గంగాధర్, గడ్డం లక్ష్మణ్, వట్నాల రమేష్, సంతోష్ మేస్త్రి, థైదల్ రాజు రచ్చ కుశాల్ అమూల్ తదితరులు ఉన్నారు.