స్టేషన్గన్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ సింగపురం ఇందిరకు వరంగల్ పార్లమెంటు టికెట్ కేటాయించాలని మండల్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ కొత్తపల్లి బిక్షపతి అన్నారు. బుధవారం మండలంలోని కర్ణ పురం గ్రామంలోనీ ఆసియ ఖండంలోనే అతి పెద్ద క్రీస్తు జ్యోతి ప్రార్థన మందిరం లో ఆయన ఆధ్వర్యంలో డాక్టర్ రెవరెండ్ పాల్సన్ రాజుచే ప్రత్యేక ఆశీస్సుల తీసుకొనీ, ప్రార్థన చేయించడం జరిగినది. ఈ సందర్భంగా ఆయన, చిల్పూర్ మండలాధ్యక్షులు గడ్డం సురేష్ పాల్గొని మాట్లాడుతూ వరంగల్ పార్లమెంటు సీటు దళితులైన స్టేషన్గన్పూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఇంద్రకి టికెట్ ఇస్తే భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని అన్నారు.వరంగల్ పార్లమెంట్లో ఆరు నియోజకవర్గాలలో 4 ఎమ్మెల్యే స్థానాలు కాంగ్రెస్ పార్టీ ఉండగా రెండు టీఆర్ఎస్ స్థానాలు ఉన్నాయన్నారు. ఈ ఎన్నికల్లో స్టేషన్ ఘన్పూర్ లో ఇంద్ర స్వల్ప ఆదిక్యంతో ఓటమి చెందడంలో నియోజకవర్గ ప్రజలు పూర్తి నిరాశతో ఉన్నారని అన్నారు. ఈ క్రమంలో వరంగల్ పార్లమెంట్ టికెట్ సింగపురం ఇంద్రకి ఇస్తే వివిధ నియోజకవర్గంలోని ప్రజలు కాంగ్రెస్ కార్యకర్తలు తమ భుజాలపై వేసుకొని ఇందిరాని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని అధిష్టానానికి హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ధర్మసాగర్ మండల్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు వక్కల రవీందర్,ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు బైరపాక దివాకర్,స్టేషన్గన్పూర్ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సింగపురం దయాకర్,సింగపురం నాగయ్య, సింగపురం శ్రీను, సింగపురం రాజు, సింగపురం వెంకటయ్య, గుండె మల్లేష్, శిఖరాజు,సిక వసంత రవి, ఇల్లందుల యాదగిరి. మినుముల సురేష్, సారయ్య, యువజన నాయకులు వివిధ గ్రామ శాఖ అధ్యక్షులు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.