సమన్వయంతో అభివృద్ధి చేసుకోవాలి: ఎంపీపీ విఠల్ 

నవతెలంగాణ – నసురుల్లాబాద్ 
ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేసి గ్రామాలను అభివృద్ధి చేయాలని నసురుల్లా బాద్ ఎంపీపీ పాల్త్య విఠల్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని మండల సమీకృత సముదాయ భవనంలో ఏర్పాటు చేసిన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. మండల పరిధిలోని ఉన్న అధికారులు వారి వారి శాఖల నివేదికలను చదివి వినిపించారు. సభ ప్రారంభంకాగానే ఎంపీటీసీలు, సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. సమావేశానికి కొంతమంది అధికారులు సమయపాలన పాటించడం లేదని ఎంపీటీసీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నసూరుల్లాబాద్ మండల పరిధిలో ఉన్న వ్యవసాయ విస్తీర్ణ అధికారులు సమయపాలన పాటించడం లేదని, దీనితో గ్రామాల్లో రైతు సమస్యలు తీవ్రంగా ఏర్పడుతున్నాయని సభ్యులు సభ దృష్టికి తీసుకొచ్చారు.  సమయపాలన పాటించని అధికారులు తగు చర్యలు తీసుకోవాలని తీర్మానం చేశారు. మండలంలో 17 పౌర సరఫరా దుకాణాలు ఉన్నాయని ఇందులో ఆరు పౌరసరపర దుకాణాల డీలర్లు లేకపోవడంతో ఉన్నతాధికారులకు నివేదిక పంపమని తహసిల్దార్ సభ దృష్టికి తీసుకువచ్చారు. వివిధ గ్రామాల్లో మిషన్ భగీరథ తాగునీరు రాణి రోజుల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని మిషన్ భగీరథ అధికారులు చెప్పారు.గత ప్రభుత్వం హయాంలోనే 95 శాతం మిషన్‌ భగీరథ పనులు పూర్తయ్యాయని చెంచు గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తవద్దని అధికారులకు సూచించారు. విధుల నిర్వహణలో అధికారులు అంకితభావంతో పనిచేయాలన్నారు. వేసవికాలం దృష్ట విద్యుత్ సమస్య తీవ్రంగా ఉంటుందని వ్యవసాయ విద్యుత్ రాత్రి 12 గంటల నుంచి ఉదయం తెల్లవారుజామున వరకు ఉంటుందన్నారు రైతులు వ్యవసాయ విద్యుత్ను సద్వినియోగం చేసుకోవాలని విద్యుత్ అధికారులు సూచించారు. గ్రామాల్లో వ్యవసాయానికి, గృహాలకు అప్రకటిత కరెంట్‌ కోతలు విధిస్తున్నారని పలువురు ఎంపీటీసీ సభ్యులు సభలో లేవనెత్తగా.. ప్రభుత్వం మారగానే మార్పు వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆప్షన్ నెంబర్ మాజీ ఎంపీడీవో నీలవతి, వైస్ ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి, అధికారులు తదతరులు పాల్గొన్నారు.