నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని బిజ్జల్ వాజి సర్పంచ్ పదవి కాలం ముగియడంతో గ్రామస్తుల అధ్వర్యంలో సర్పంత్ గౌళే యాదవ్ ను ఎంపీపీ యశోద, వైస్ ఎంపీపీ ఉమాకాంత్ శుక్రవారం నాడు ఘణంగా సన్మానించారు. గ్రామాభివృద్దికి ఎంతగానో కృషి తోడ్పాటునందించారని ఎంపిజివో నగేష్ అన్నారు. మంచి పనులు చేస్తే వారిని చిరకాలం గ్రామస్తులు గుర్తుంచుకుంటారని కష్టపడే తత్వం ఉండాలనిఎంపివో యాదగిరి అన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో జేపిఎస్ దివ్య, నాయకులు నీలుపటేల్, దాదారావ్ పటేల్, మాదారావ్ దేశాయి, బొల్లిగంగాధర్, సీనీయర్ అసిస్టెంట్ రంజిత్ కూమార్ తదితరులు పాల్గోన్నారు.